Site icon NTV Telugu

నేడు​ షర్మిల రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన

YS Sharmila

YS Sharmila

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల, ఇవాళ తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల… తల్లి విజయమ్మతో కలిసి ఈరోజు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. సాయంత్రం పార్టీ జెండా, ఎజెండా ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ తనయ షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు.

read also : వాహనదారులకు షాక్‌.. మరోసారి పెరిగిన పెట్రో ధరలు

ఉదయం పదిన్నరకు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి, బేగంపేటకు షర్మిల చేరుకుంటారు… మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా జేఆర్సీ కన్వెన్షన్ కు బయలుదేరనున్నారు. మార్గ మధ్యలో పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.. 3 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ లో పార్టీ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5 గంటలకు షర్మిల పార్టీ ప్రకటనతో పాటు జెండా, ఎజెండాను వెల్లడిస్తారని వెస్సార్టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు.

Exit mobile version