చాలా కాలం తరువాత స్టాక్ మార్కెట్లు భారీగా లాభ పడ్డాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం అయినప్పటి నుంచి భారీ లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఒకదశలో వెయ్యి పాయింట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఉదయం సెన్సెక్స్ 59,275 పాయంట్లతో ప్రారంభమయ్యి లాభాల దూకుడును ప్రదర్శించి 985.03 పాయింట్ల లాభంతో 59,885.36 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తో పాటుగా నిఫ్టి కూడా దూకుడు ప్రదర్శించింది. 276.30 పాయింట్ల లాభంతో 17,823 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు మార్చకపోవచ్చన్న అంచనాలు, చైనా స్థిరాస్తి దిగ్గజం వివరణ ఇవ్వడం మార్కెట్ల దూకుడుకు కారణమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక, బజాజ్ ఫిన్ సర్వ్, హిందోల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, కోల్ ఇండియా వంటీ సంస్థల షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి.
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్…
