దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన ప్రేక్షక్షుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో నందమూరి, మెగా అభిమానుల్లో జోష్ పెంచింది.
ఈ వీడియోతో అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి సినిమా అంటే మామూలుగా ఉండదు.. అందులోను ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఇస్తామంటూ.. ట్విట్టర్ వేదిక చిత్ర యూనిట్ ప్రకటించింది.
చెప్పిన విధంగానే శుక్రవారం ‘బ్లాస్టింగ్ బీట్స్.. హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్, నవంబర్ 10న’ అంటూ సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్, రామచరణ్ స్టెపులేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో డ్యాన్స్ చేసింది చూడాలంటే మాత్రం నవంబర్ 10వరకు ఆగాల్సిందే.