Site icon NTV Telugu

స‌ముద్రంలో వింత ఆకారాలు… ప‌రుగులు తీసిన ప‌ర్యాట‌కులు…

స‌ముద్రంలోని బీచ్‌ల‌కు వెళ్లి ఎంజాయ్ చేయ‌డం అంటే అంద‌రికీ ఇష్ట‌మే.   ఎండాకాలం వ‌చ్చిందే అంటే ఎక్క‌డా ఉన్నా స‌ముద్రం బీచ్‌ల ముందు వాలిపోతుంటారు.  ఇలా ఎంజాయ్ చేసే స‌మ‌యంలో స‌డెన్‌గా స‌ముద్రంలో వింత ఆకారాలు క‌నిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి.  గుండెలు జారిపోతాయి.  ఎంత భ‌యం లేని వ్య‌క్తి అయినా స‌రే భ‌య‌ప‌డి పారిపోతారు.  వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ ఉన్న‌ది.  ఆ బీచ్‌కి నిత్యం వేల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.  అలా వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు ఎదురుగా స‌ముద్రంలో వింత ఆకారాలు క‌నిపించాయి. అంతే అక్క‌డి నుంచి జ‌నాలు ప‌రుగులు తీశారు.  ముసుగు ధ‌రించిన వింత ఆకారాలు ఉన్నాయని, బీచ్‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని వదంతులు వ్యాపించ‌డంతో ఆధికారులు షాక్ అయ్యారు.  వెంట‌నే స‌ముద్రంలోకి వెళ్లి చూడ‌గా, అవి వింత ఆకారాలు కాద‌ని, పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు చెందిన చెక్క‌ల‌ని, చాలా కాలంగా స‌ముద్రంలో ఉండిపోవ‌డం వ‌ల‌న నాచు, చెత్త వంటివి పేరుకుపోవ‌డంతో వింత ఆకారాల్లా క‌నిపిస్తున్నాయ‌ని అధికారులు తెలిపారు.  

Read: రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇదే అస‌లైన హీరో…

Exit mobile version