Site icon NTV Telugu

శాస్త్ర‌వేత్త‌ల ఆందోళ‌న‌: మూడు ద‌శాబ్దాలుగా అదే ప‌రిస్థితి… ఇలానే కొన‌సాగితే…

క‌రోనా మ‌హ‌మ్మారి వంటి వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ప్ప‌టికీ క‌రోనా వ‌ద‌ల‌ట్లేదు. గ‌త రెండేళ్ల నుంచి త‌గ్గిన‌ట్టే త‌గ్గీ మ‌ళ్లీ విజృంభిస్తోంది.  వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా సోకుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. అయితే, అనేక జ‌బ్బుల‌కు పూర్తిస్థాయి మందులు లేవు.  ముఖ్యంగా యాంటీబ‌యాటిక్ మందుల కొర‌త తీవ్రంగా ఉన్న‌ది.  మూడు ద‌శాబ్దాల నుంచి ఈ కొర‌త ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  గ‌త కొంత కాలంగా యాంటిబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్ష‌న్ల‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని, యాంటి బ‌యాటిక్ మందుల కొర‌త కార‌ణంగానే ఇలా జ‌రుగుతోంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.  మూడు ద‌శాబ్దాలుగా కొత్త యాంటి బ‌యాటిక్ మందులు త‌యారు కావ‌డంలేద‌ని, ఇలానే కొన‌సాగితే చిన్నచిన్న రోగాలు కూడా మ‌నుషుల‌కు ప్రాణాంత‌కంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

Read: ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన చేప ఇదే…

Exit mobile version