Site icon NTV Telugu

శ‌శిక‌ళ కీల‌క వ్యాఖ్య‌లు- క‌లిసి ఉంటేనే అధికారంలోకి…

అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 ఏళ్లు పూర్త‌యింది.  ఈ సంద‌ర్భంగా అన్నాడీఎంకే నేత‌లు పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు ఎంజీఆర్ స‌మాథిని సంద‌ర్శించి నివాళులు అర్పిస్తున్నారు.  అటు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స‌మాధిని కూడా సంద‌ర్శించిన నివాళులు అర్పిస్తున్నాయి.  అయితే, అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ కూడా జ‌య‌ల‌లిత‌, ఎంజీఆర్ స‌మాధుల‌ను సంద‌ర్శించిన నివాళులు అర్పించారు.  అనంత‌రం అమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  మ‌నం ఐక్యంగా క‌లిసిక‌ట్టుగా ఉంటేనే అధికారంలోకి వ‌స్తామ‌ని, విడిపోతే ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌ప‌డ‌తారని, క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శ‌శిక‌ళ పేర్కొన్నారు.  అయితే, శ‌శిక‌ళ‌కు పార్టీలో స్థానం లేద‌ని ఇప్ప‌టికే అన్నాడీఎంకే నేత‌లు తెగేసి చెప్పారు.  అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా ప్ర‌జ‌ల‌కోసం పోరాటం చేస్తుంద‌ని, ప్ర‌జల ప‌క్షాన నిల‌బ‌డి పోరాటం చేస్తామ‌ని, ప్ర‌జ‌లే అధికారంలోకి తీసుకొస్తార‌ని అన్నాడీఎంకే పార్టీ నేత‌లు చెబుతున్నారు.  చిన్న‌మ్మ ఎలాగైనా తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నారు.  

Read: హుజూరాబాద్ లో పెరిగిన ఓటర్లు.. టెన్షన్లో నేతలు…?

Exit mobile version