NTV Telugu Site icon

లైవ్‌: భగవద్గీత సంపూర్ణ పారాయణం..

Bhagavad Gita

Bhagavad Gita

సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత.. మహాభారతంలోని భాగమైనా ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్య ఖండం. భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహం. భీష్మపర్వంలోని 25 వ అధ్యాయం నుంచి 42 వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు.. అయితే, తొలిసారి భక్తి టీవీ 700 శ్లోకాల సంపూర్ణ పారాయణ యజ్ఞం చేస్తోంది… భగవద్గీతా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శ్రీ ఎల్‌వీ గంగాధర శాస్త్రి గారి ఆధ్వర్యంలో.. అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శిష్యులతో.. భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని లైవ్‌లో చేస్తోంది… ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానున్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది లింక్‌ను క్లిక్‌ చేయండి..