NTV Telugu Site icon

కేపీహెచ్‌బీలో సందడి చేసిన సల్మాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో సందడి చేశారు. ఆయన నటించిన అంతిమ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేపీహెచ్‌బీలోని సుజనా ఫోరమ్‌ మాల్‌కు సల్మాన్‌ విచ్చేశారు. అయితే సల్మాన్‌ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఒక్కసారిగా మాల్‌ ప్రాంగంణం కిక్కిరిసిపోయింది.

అయితే సల్మాన్‌ ఖాన్‌ అంతిమ్‌ సినిమాలో మరోసారి పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయుష్‌ శర్మ నటించారు. ఈ మూవీ గత నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 17 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.