సాధారణంగా బార్లు అనగానే మనకు మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగేందుకు మందుబాబులు బార్లకు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మద్యం ద్వారానే అధిక ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్లలో మద్యం అమ్మరు. మద్యం ప్లేస్‌లో పాలు అమ్ముతుంటారు. పాల కోసమే అక్కడి ప్రజలు బార్లకు వస్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వకండి. ర్వాండా దేశ రాజధాని కిగాలీలో ఎక్కడ చూసినా మనకు బార్లు కనిపిస్తుంటాయి. ఈ బార్లలో తెల్లని చిక్కని పాలను అమ్ముతుంటారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఈ బార్లకు వచ్చి రుచికరమైన పాలను తసుకుంటూ ఉంటారు. పాలు ఇప్పుడు ఆ దేశంలో ఒక భాగస్వామ్యం అయ్యాయి. పాలను తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పౌష్టికాహార లోపం నుంచి బయటపడొచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 1994వ సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన మారణకాండలో దాదాపు 8 లక్షల మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మేకలు, ఆవుల కాపర్లు ఉన్నారు. ఆ తరువాత ఆ దేశంలో పౌష్టికాహార లోపం తలెత్తింది. దీని నుంచి బయటపడేందుకు ఆ దేశం ప్రయత్నించింది. 2006 వ సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు పాల్ కగామే గిరింకా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవును ఇవ్వడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. దేశంలో ఆవుపాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మనలాగా అక్కడి ప్రజలు కాఫీలు, టీలు పెద్దగా తాగరు. పాలు మాత్రమే తాగుతారు. ఎక్కవగా చల్లని పాలను తీసుకోవడానికే ప్రజలు ఇష్టపడతారట.
Read: ఆయుధపోటీ ఇలానే కొనసాగితే… మరో ప్రచ్ఛన్నయుద్ధం తప్పదా?
