చెట్లకు కాసులు కాస్తాయంటే ఎవరూ నమ్మరు. చెట్లకు కాసులు కాయడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేను అని తిట్టిపోస్తారు. లేదు లేదు చెట్లకు కాసులు కాస్తున్నాయి అని చెప్పి ఓ ఇస్టాగ్రామ్ యూజర్ వీడియో తీసి చూపించాడు. చెట్టుకు ఉన్న క్యాప్సికమ్ కాయను కట్ చేయగా అందులో నుంచి రూపాయి నాణేలు కింద పడ్డాయి. రెండో కాయను కట్ చేయగా అందులో నుంచి నాణేలు కిందపడ్డాయి. ఇదేం విడ్డూరం అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే, ఇది కేవలం యూజర్లను ఆకట్టుకోవడం కోసం చేసిన వీడియో మాత్రమే అని, ముందుగా కాయను మధ్యకు కోసి అందులో డబ్బులు ఉంచి అతికించాడట. ఆ తరువాత వీడియో చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియో పాపులర్ కావడం కోసం ఏదైనా చేయవచ్చిన అంటున్నాడు విడీయో రూపకర్త. నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read: సరికొత్త ఆలోచన: వరదల్లో కారు కొట్టుకుపోకుండా ఉండేందుకు…
