Site icon NTV Telugu

అల్లు అర్జున్, ర్యాపిడో…. ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలి : సజ్జనార్

ర్యాపిడో యాడ్‌ వివాదంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని.. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవన్నారు. సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు.

తమ నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని… తక్షణమే అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసీ కి క్షమాపణలు చెప్పాలని వెల్లడించారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్ లలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని చురకులు అంటించారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదన్నారు. సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని… తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్ లను కించపరచకూడదని వెల్లడించారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందన్నారు సజ్జనార్‌.

Exit mobile version