పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం తప్పింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు కట్టలు విరిగిపోవడంతో బస్సు వెనక టైర్లపై ఒరిగిపోయింది బస్. ప్రమాదం సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ బస్సుని పోలవరం కుడికాలువ బ్రిడ్జి వద్ద నిలిపివేశారు డ్రైవర్.
ఘోర ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు వున్నట్టు తెలుస్తోంది. ద్వారకాతిరుమల నుండి ఏలూరు వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జల్లేరు వాగులో బస్సు బోల్తా పడి ప్రమాదం జరగగా.. 10 మంది మృతి చెందారు. జల్లేరు వాగు వంతెనపై వెళ్తుండగా హఠాత్తుగా బస్సు ముందుకు దూసుకొచ్చింది బైక్. ఆ ద్విచక్ర వాహనదారుడిని తప్పించ బోయి అదుపు తప్పి వాగులోకి బస్సు పడిపోయింది. ఘటనా స్థలిలోనే 9 మంది దుర్మరణం చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో మహిళ మృతి చెందింది. భద్రాచలం నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఈ ప్రమాదానికి గురైంది.
అలాగే, రెండురోజుల క్రితం జిల్లాలోనే మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భీమడోలు జంక్షన్ వద్దకు రాగానే రోడ్డుప్రక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిని స్టానిక ఆస్పత్రికి తరలించారు.