NTV Telugu Site icon

ఆర్ఆర్ఆర్ కు కొత్త అర్ధం చెప్పిన భోజ‌న ప్రియులు…

ఆర్ఆర్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావ‌త్ భార‌త‌దేశం మొత్తం మారుమ్రోగి పోతున్న‌ది.  ఇండస్ట్రీలో భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.  రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌లు హీరోలు.  ఈ మూవీ జ‌న‌వ‌రి 7 వ తేదీన విడుద‌ల కాబోతున్న‌ది.  ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఆర్ఆర్ఆర్ పేరుతో ఇప్పుడు బిర్యానీ పాయింట్లు కూడా వెలుస్తున్నాయి.  సినిమా ప‌రంగా ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం ర‌ణం రుధిరం అని.  కానీ, ఈ బిర్యానీ పాయింట్ ప‌రంగా చూస్తే రండి, రోజంతా, రుచిక‌రం పేరుతో ట్యాగ్‌లైన్‌ను బోర్డును ఏర్పాటు చేసి బిర్యానీ ప్రియుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  

Read: ప్ర‌పంచంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు…