ప్ర‌పంచంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు…

ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ మొద‌ట ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డింది.  అక్క‌డ కేసుల‌ను గుర్తించిన కొన్ని రోజుల్లోనే వేగంగా విస్త‌రించ‌డం మొద‌లుపెట్టింది.  ఇప్ప‌టికే 99 కేసులు న‌మోదైన‌ట్టు ద‌క్షిణాఫ్రికా అధికారులు పేర్కొన్నారు.  ఈ వేరియంట్‌పై ద‌క్షిణాఫ్రికా అధికారులు అల‌ర్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగి ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోయాయి.  కొన్ని రోజుల క్రిత‌మే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై ఆంక్ష‌లు ఎత్తివేశారు.  పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణాలు కొన‌సాగుతున్నాయి.  

Read: వైర‌ల్‌: ఏనుగు ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌… మ‌నుషుల‌ను మించేలా…!!

ఈ స‌మ‌యంలో ఒమిక్రాన్ వేరియంట్ బ‌య‌ట‌ప‌డ‌టం, డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌కారి అని తేల‌డంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.  ఇప్ప‌టికే యూకేలో 3 కేసులు, బోట్స్‌వానాలో 6, హాంకాంగ్‌లో 2, ఆస్ట్రేలియాలో 2, ఇట‌లీ, ఇజ్రాయిల్‌, బెల్జియం, చెక్ రిపబ్లిక్ లో ఒక్కో ఒమిక్రాన్ కేసు న‌మోదైంది. కేసులు పెరుగుతుండ‌టంతో వివిధ దేశాలు ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించాయి.  ఇక ఇజ్రాయిల్‌లో ఒక కేసు న‌మోదు కావ‌డంతో దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. విదేశీ విమానాల‌ను బ్యాన్ చేసింది. ఒమిక్రాన్‌లో మ్యూటేష‌న్లు అధికంగా ఉండ‌టంతో ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Related Articles

Latest Articles