చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ కారణంగా కాలుష్యం పెరిగిపోతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్, గ్యాస్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలు వాహనాలకు వినియోగించే బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే, భవిష్యత్తులో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలను, హైడ్రోజన్‌తో ఎలక్ట్రిసిటీని, హైడ్రోజన్ వంట గ్యాస్‌ను వినియోగించే రోజులు రాబోతున్నాయి. నీటినుంచి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను వేరుచేస్తారు. ఈ హైడ్రోజన్ గ్యాస్ రూపంలో జనరేటర్లలో స్టోర్ చేసి కార్లకు ఇంధనంగా, వంట గ్యాస్‌గా, ఎలక్ట్రిసిటి ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు.
Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే…
మల్టీ పర్పస్‌గా గ్యాస్‌ను వినియోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటిని వినియోగించుకొని నీటి నుంచి హైడ్రోజన్‌ను జనరేటర్లు ఉత్పత్తి చేస్తాయి. అయితే, సూర్యరశ్మి నుంచి ఫోటాలిసిస్, ఫోటోనోడ్ ప్రక్రియల ద్వారా నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరుచేసే ప్రక్రియను మద్రాస్, గౌహతి ఐఐటీ సంస్థలు రూపొందించాయి. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. అన్నిరకార పరిశోధనలు పూర్తి చేసిన తరువాత వీటిని విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి రూఫ్ మీద తప్పనిసరిగా హైడ్రోజన్ జనరేటర్లు దర్శనం ఇస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.