పశ్చిమ బెంగాల్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 35 మంది బంధువులు ట్రక్కులో బయలుదేరారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ట్రక్కు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Read: ఒమిక్రాన్‌పై ప్రపంచదేశాలు అప్రమత్తం… మొదలైన ఆంక్షలు…
ఇక మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
