అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందారు. మరో మగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. అనంతపురం జిల్లాలో పామిడి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రోజువారి కూలి పనుల కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. మృతులంతా కొప్పలకొండ వాసులుగా గుర్తించారు.
Read: కార్తికమాసం విశిష్టత ఇదే…
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం దేశంలో రోడ్డు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వలనే అత్యధికమంది మృతి చెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.