తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ స‌ర్కార్‌. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ‌ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

https://ntvtelugu.com/ap-covid19-update-on-dec-25th/

ఓమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం… పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే.. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిం చింది. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో… ప్రజ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది.