ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ కొత్త జీవిని కనుగోన్నారు. గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ రీజియన్‌లోని మైనింగ్‌జోన్‌లో భూమికి 60 మీటర్ల లోతులో ఓ కొత్త జీవిని కనుగొన్నారు. ఈ కొత్త జీవికి 1306 కాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కొత్త జీవికి కళ్లు లేకపోవడంతో స్పర్శ, వాసన ఆధారంగా జీవిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిలపిడ్ కుటుంబానికి చెందిన ఈ జీవికి యుమిల్లిప్స్ పెర్సెఫోన్ అనే పేరును పెట్టారు.
Read: ఒమిక్రాన్ వేరియంట్: వందకు చేరువలో కేసులు…అక్కడ మళ్లీ ఆంక్షలు…
మిలపీడ్ అంటే వెయ్యికాళ్లు అనే అర్థం ఉందని, కానీ ఇప్పటి వరకు ఈ జాతికి చెందిన జీవుల్లో అన్ని కాళ్లున్న జీవులను నివశించి లేవని, మొదటిసారి 1306 కాళ్లున్న యుమిల్లిప్స్ పెర్సెఫోన్ జీవిని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవుల పరిణామ క్రమంలో ఇదొక అద్భుతమని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని జయించిన మొదటి జీవులు ఇవే అయి ఉంటాయని, భూమికి పదుల మీటర్ల లోపన కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవిస్తున్నాయని శాస్త్రవేత్తలుచెబుతున్నారు.