మరికాసేపట్లో పెళ్లి అనగా ఏదో కారణం చేత పెళ్లిళ్లు ఆగిన సంగతులు చూశాం. నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అయితే, పెళ్లి తంతు అంతా బాగా జరుగుతున్న సమయంలో పెళ్లి మండపంలోకి మాజీ ప్రియుడు వచ్చి గలాటా చేయడం వలన పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో ఓ పెళ్లి మండపంలో వివాహం జరుగుతున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడు దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ వ్యక్తి సడెన్ గా వారి మధ్యలోకి దూరిపోయాడు. పెళ్లికూతురి నుదిటిపై తిలకం దిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే, వధువు తలపై ముసుగు కప్పుకునే ప్రయత్నం చేసింది.
Read: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు…
కానీ బలవంతంగా ఆ వ్యక్తి ఆమె నుదిటిపై సింధూరం పెట్టాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆ వ్యక్తిని చితక్కొట్టారు. మధ్యలోకి దూరి వివాహాన్ని అపేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఆ వధువు మాజీ ప్రయుడు. అతను పనిమీద బయట ఊరికి వెళ్లగా ఆమెకు వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న ఆ మాజీ ప్రియుడు వధువును వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, మరుసటి రోజు పెద్దలు పంచాయతీ నిర్వహించి పెద్దలు నిర్ణయించిన అబ్బాయికే ఆ వధువును ఇచ్చి వివాహం చేశారు. దీంతో చేసేది లేక ఆ మాజీ ప్రియుడు తిరిగి వెళ్లిపోయాడు.