ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ రంజాన్. ముస్లింలకు రంజాన్ నెల చాలా పవిత్రమైనది. భారత దేశంలో రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలు మొదలు పెట్టనున్నారు. సౌదీ దేశాల్లో ఇవాళ్టి నుంచే రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అయ్యాయి. అయితే, మనదేశంలో ఇవాళ నెలవంక కనిపించడంతో శుక్రవారం నుంచి దీక్షలు ప్రారంభిస్తారు.
Alsor Read: Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..
రంజాన్ ప్రారంభం, ముగింపు చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, రంజాన్ నెలవంక మొదట సౌదీ అరేబియా, కొన్ని పాశ్చాత్య దేశాలతో పాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఒక రోజు తరువాత మిగిలిన భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇతర దేశాలలో కనిపిస్తుంది. మార్చి 22న భారతదేశం, బంగ్లాదేశ్, ఇతర దక్షిణాసియా దేశాలలో నెలవంక కనిపించలేదు. అయితే, నెలవంక సౌదీ అరేబియా, యుఎఇ, యుకె ఇతర ముస్లిం మెజారిటీ దేశాలలో మార్చి 22 న కనిపించింది. అందుకే ఆయా దేశాలు రంజాన్ మొదటి ఉపవాసాన్ని గురువారం ప్రారంభించాయి. ఈ ఏడాది మొదటి రంజాన్ ఉపవాసం మార్చి 24న జుమ్మా (శుక్రవారం) నాడు ప్రారంభమవుతోంది. చంద్రమానం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ ఉండటంతో రంజాన్ ఉపవాస తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది.