సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రజినీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మోహన్ బాబును కలవకుండా వెళ్ళరు. ఇద్దరి మధ్య అంతటి గాఢమైన స్నేహబంధం ఉంది. తాజాగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ స్నేహితులకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్ అంటూ విష్ణు షేర్ చేసిన పిక్స్ లో వారు వైట్ అండ్ వైట్ ధరించారు. మరో పిక్ లో మోహన్ బాబు, రజనీకాంత్ లతో మంచు విష్ణు కూడా కలిసి ఉన్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూసిన నెటిజన్లు ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ తో ఏదైనా మల్టీస్టారర్ తీసే ఆలోచనలో ఉన్నారా ? అంటూ సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇక ఇటీవలే రజినీకాంత్ హైదరాబాద్‌లో “అన్నాత్తే” నెల రోజుల షెడ్యూల్ పూర్తి చేశారు. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్…!
