గత నాలుగు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నైనిటాల్‌తో ప్రముఖ పర్యాటక ప్రాంతం రాణిఖేత్, అల్మోరాలకు సంబంధాలు తెగిపోయాయి. రాణిఖేత్‌లో కేవలం 24 గంటలకు మాత్రమే సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని ఈ ఇంధనాన్ని అత్యవసర సేవలకు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇంటర్నెట్ సేవలు స్థంభించిపోయాయి. ఇటు, అల్మోరా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. 24 గంటల్లోగా అటు డెహ్రడూన్‌తో గాని, ఇటు నైనిటాల్‌తో గాని సంబంధాలు పునరుద్దరించకుంటే ఇంధనానికి తీవ్రమైన కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వర్షాల ప్రభావం: ఉత్తరాఖండ్‌లో కొత్త ఇబ్బందులు…24 గంటలు దాటితే…
