వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కేవలం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది సన్‌రైజర్స్. ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓటమిపాలైంది. జేసన్ హోల్డర్ స్కోర్‌ను పరిగెట్టించినా… టీమ్‌ను గెలిపించలేకపోయాడు. లాస్ట్ బాల్‌కి 7 పరుగులు కావాల్సి ఉండగా…ఒక రన్ మాత్రమే వచ్చింది. దీంతో ఐదు పరుగులు తేడాతో ఓడిపోయింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది.
షమి వేసిన తొలి ఓవర్ మూడో బంతికి డేవిడ్ వార్నర్ కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. తర్వాత షమి వేసిన మూడో ఓవర్‌లో విలియమ్సన్ బౌల్డయ్యాడు. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔటవడంతో జట్టు స్కోరు చాలా నెమ్మదిగా కదిలింది. ఇక హైదరాబాద్‌కు ఓటమి లాంఛనమే అనుకున్న తరుణంలో… జేసన్ హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. దీంతో 4 బంతుల్లో 10 పరుగులుగా మారింది. తర్వాత రెండు బంతులు పరుగులేమి రాలేదు. దీంతో లక్ష్యం రెండు బంతుల్లో పది పరుగులుగా మారింది. ఐదో బంతికి రెండు పరుగులే వచ్చాయి. ఫలితంగా సన్‌రైజర్స్ ఓటమిపాలైంది.
