NTV Telugu Site icon

పంజాబ్ సీఎం రాజీనామా…

పంజాబ్ లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి.  పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ వ‌ర్గానికి,  పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూ వ‌ర్గానికి మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా విభేదాలు నెల‌కొన్నాయి.  అంత‌ర్గ‌త విభేదాల‌ను త‌గ్గించేందుకు సిద్ధూకు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించి అమ‌రీంద‌ర్ సింగ్‌ను ముఖ్య‌మంత్రిగా కొన‌సాగించారు.  అయితే, తాత్కాలికంగా ఆ విభేదాలు స‌ద్దుమ‌ణిగినా, ఇటీవ‌ల కాలంలో మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చాయి.  ముఖ్య‌మంత్రిని సొంత‌పార్టీలో విమ‌ర్శించే వ్య‌క్తులు ఎక్కువ కావ‌డంతో విసుగు చెందిన సీఎం ఈరోజు రాజీనామా చేశారు.  ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌కు అంద‌జేశారు.  ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు పంజాబ్ కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం స‌మావేశం కాబోతున్నది.  అమ‌రీంద‌ర్ సింగ్ వార‌సుడిని ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  వ‌చ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌డంతో ఆ రాష్ట్ర రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.  

Read: మందుబాబుల‌కు షాక్‌: రేపు న‌గ‌రంలో మ‌ద్యం దుకాణాలు బంద్‌…