NTV Telugu Site icon

ఆ ఇంటి నిండా పాత వ‌స్తువులే… ఎందుకు దాస్తున్నాడంటే…

పాత వ‌స్తువుల‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.  అందుకే చాలామంది పాత‌వాటిని క‌లెక్ట్ చేస్తుంటారు.  భ‌ద్రంగా దాచుకుంటుంటారు.  పాత కాయిన్స్‌, పాత పేప‌ర్లు, పాత టీవీలు ఇలా హాబీలు ఉంటాయి.  అయితే, పుదుచ్చేరికి చెందిన అయ్య‌నార్ అనే వ్య‌క్తి త‌న చిన్న‌త‌నం నుంచి పాత‌కాలం నాటి వ‌స్తువుల‌ను జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌రుస్తూ వ‌స్తున్న‌డు.  50 ఏళ్ల నుంచి ఇలా వ‌స్తువుల‌ను సేక‌రించి భ‌ద్రంగా ఉంచుతున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు.  రాబోయే త‌రం వారికి పాత‌కాలం నాటి వ‌స్తువులు ఎలా ఉంటాయి, వారి సంస్కృతి ఎలా ఉంటుంది అని తెలియ‌జేసేందుకు వీటిని దాచిపెడుతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  ఇక పాత వ‌స్తువుల‌కు గిరాకి కూడా ఎక్కువ‌గా ఉంటుంది.  కొంత‌మంది పాత వ‌స్తువుల‌ను సేక‌రించి విప‌ణిలో అమ్మేస్తుంటారు.  

Read: వందేళ్ల‌యినా ఇప్ప‌టికీ క‌నిపించ‌ని ఆ ట్రైన్‌… మిస్ట‌రీగా మిగిలిపోయిన 104 మంది అదృశ్యం…