Site icon NTV Telugu

మా ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే..!

Prakash Raj Press Meet

Prakash Raj Press Meet

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్‌ రాజ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తమ ప్యానల్‌ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్ లోని అందరూ పాల్గొంటారన్నారు. అప్పటివరకు స్పోక్స్ పర్సన్స్ మాత్రమే మీడియాతో మాట్లాడతారని’ ప్రకాష్ రాజ్ తెలిపారు.

  1. అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్‌
  2. ట్రెజరర్‌ : నాగినీడు
  3. జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌
  4. ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
  5. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌
  6. జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌

ప్రకాశ్‌ రాజ్‌ ఎక్స్‌క్యూటివ్‌ మెంబెర్స్ జాబితా ఇదే..

Exit mobile version