మన దేశం నుంచి వేరే దేశానికీ వెళ్లాలంటే ఫ్లైట్ టిక్కెట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. పాస్ పోర్ట్ కూడా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే నో ఎంట్రీ..పాస్ పోర్టుతోనే వేరే దేశంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. వారికి ఎటువంటి వీసాతో పని ఉండదు. అటువంటి శక్తివంతమైన పాస్ పోర్టు కలిగిన దేశాలు ఏవి? ఆ జాబితాలో మన భారతదేశం ఎక్కడ ఉందో ఓ సారి చూద్దాం…
మన దేశంలో ఆధార్ కార్డు ఎలాగో అలాగే పాస్ పోర్ట్ కూడా.. మీరు ఏ దేశానికి చెందిన వారో తెలియజెప్పే గుర్తింపు. దీని ఆధారంగానే మీరు ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లడానికి అనుమతులు పొందుతారు. ప్రతి దేశంలోని పౌరులకు వారి దేశాల్లో పాస్ పోర్టు ఉంటుంది. దేశం సరిహద్దు దాటి వేరే దేశానికి వెళ్లాలి అంటే తప్పనిసరిగా పాస్ పోర్టు చూపించాల్సిందే. దీనిని చూపితే ఆ దేశం వీసాను మంజూరు చేస్తుంది. అంటే పాస్ పోర్టు మన దేశం నుంచి వచ్చే గుర్తింపు అయితే.. దీని ద్వారా వచ్చే వీసా మీరు వెళ్లాలనుకుంటున్న దేశం వారు మీకు ఇచ్చే అనుమతి.. అన్ని పాస్ పోర్ట్ లు ఒక్కటే కాదు.. ఒక్కో దేశానికి ఒక్కో పాస్ పోర్ట్ ఉంటుంది.. అందులో కొన్ని పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ ఉంటాయి.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ పౌరులు ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ కలిగిన గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు.
ఇక రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు ఉన్నాయి. ఇవి 192 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్ ను కల్పిస్తున్నాయి. జర్మనీ, స్పెయిన్ దేశాలు 190 వీసా స్కోర్ తో మూడవ స్థానంలో నిలవగా, ఫిన్ ల్యాండ్, ఇటలీ, లక్సమ్ బర్గ్ దేశాలు 189 వీసా స్కోర్ తో నాల్గవ స్థానంలో నిలిచాయి. ఇక ఐదవ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇవి 188 వీసా స్కోరును కలిగి ఉన్నాయి..
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఇండెక్స్ 2023లో భారత పాస్ పోర్ట్ 85వ స్థానంలో ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా 59 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుందని నివేదిక తెలిపింది.ఇక చెత్త పాస్ పోర్ట్ విషయానికొస్తే..ఆఫ్ఘనిస్తాన్ పాస్ పోర్ట్ 27 వీసా ఫ్రీ స్కోరుతో 109 వ స్థానంలో ఉంది. అలాగే వీసా ఫ్రీ స్కోరు 29 తో ఇరాక్ 108వ స్థానంలో నిలిచింది. వీసా ఫ్రీ స్కోరు 30 తో సిరియా 107వ స్థానంలో నిలవగా, 32 వీసా ఫ్రీ స్కోర్ తో ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్ పోర్ట్ ల జాబితాలో పాకిస్థాన్ 106 వ స్థానంలో నిలిచింది..
