Site icon NTV Telugu

TGPSC: డిసెంబర్కు గ్రూప్-2 వాయిదా.. అధికారిక ప్రకటన

Group 1 Premium

Group 1 Premium

గ్రూప్-2 పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది టీజీపీఎస్సీ. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో.. ఈరోజు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. అనంతరం పరీక్షల వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో నిర్వహించే పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Bengaluru: పోలీసుల్ని కించపరిచేలా టాటూ.. ఎఫ్ఐఆర్

కాగా.. గతేడాది మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే.. మొదటగా ఆగష్టు 9, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాగా.. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు.. గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. గ్రూప్ 2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ మరోసారి ప్రకటన చేసింది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే గ్రూప్- 2 పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తమకు కొంత సమయం కావాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-2ను ప్రభుత్వం వాయిదా వేసింది.

Exit mobile version