దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారు వీరు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ రోజు పంజాబ్ పటియాల మెడికల్ కాలేజీలో 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయ్యి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ ఆసుపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 26 వైద్యులు కరోనా బారిన పడ్డారు.
Read: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కీలక భేటీ…
ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.5 శాతంగా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తున్నారు. ఈరోజు కూడా ఆ స్థాయిలోనే పాజిటివిటీ రేటు ఉంటే రెడ్ అలర్ట్ ను ప్రకటించాల్సి ఉంటుంది. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సి రావొచ్చు. దేశవ్యాప్తంగా పాజిటివిటి రేటు 3 శాతం వరకు ఉన్నది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రతీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. కేరళలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.
Read: ఆ దేశ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత… వైద్యం చేయవద్దంటున్న నెటిజన్లు…
మొదటి రెండు వేవ్‌లు ఢిల్లీ, ముంబైలో అత్యధికంగా ఉంటే, ఇప్పుడు ఈ రెండు నగరాలతో పాటు దేశంలోని మిగతా మెట్రోపాలిటన్ నగరాలు, ద్వితీయశ్రేణి నగరాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ తప్పనిసరి చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలానే కేసులు పెరిగితే దేశంలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు రావొచ్చు. నైట్ కర్ఫ్యూల వలన కొంత మేరకే ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా నుంచి బయటపడగలం. లేదంటే ఇబ్బందులు తప్పవు
