సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర అత్యాచార, హత్య ఘటనకు నిరసనగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిల దీక్షను చెపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించేంత వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పి దీక్షకు కూర్చున్నారు. కాగా అర్థరాత్రి సమయంలో పోలీసులు వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేశారు. షర్మిలను దీక్షాస్థలి నుంచి లోటస్‌పాండ్‌కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం బాధిత బాలిక కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిందితుడిని ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టుకోలేదని విమర్శించారు. నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Read: మగువలకు షాకిచ్చిన పుత్తడి… భారీగా పెరిగిన ధరలు…