Site icon NTV Telugu

PM Modi: ప్రకాశ్‌ సింగ్ బాదల్‌కి ప్రధాని మోడీ నివాళి

Modi And Prakash

Modi And Prakash

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని బుధవారం చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సమస్యలతో మరణించిన బాదల్‌కు నివాళులు అర్పించేందుకు ప్రధాని మోదీ చండీగఢ్ చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రకాశ్ సింగ్‌ బాదల్ కుటుంబు సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. బాదల్ మరణం వ్యక్తిగతంగా తనకు తీవ్ర లోటు అని అభివర్ణించిన మోడీ.. దేశానికి గొప్పగా దోహదపడిన భారత రాజకీయాలలో ఆయన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం ఇంటి కోసం రూ.45 కోట్లు ఖర్చు!

ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని బుధవారం చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. శిరోమణి అకాలీదళ్‌ అధినేత వారం రోజుల క్రితం మొహాలీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.

Exit mobile version