Site icon NTV Telugu

రైతులకు కేంద్రం న్యూఇయర్ గిఫ్ట్.. జనవరి 1న డబ్బులు జమ

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న దేశ వ్యాప్తంగా పదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏడాది రైతుల అకౌంట్లలో మూడు విడతలుగా రూ.6 వేలు జమ చేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. జనవరి 1, 2022న మధ్యాహ్నం 12 గంటలకు పీఎం కిసాన్ యోజన పథకం కింద రూ.6వేలు నగదును కేంద్రం బదిలీ చేయనుంది.

Read Also: ఫ్యాక్ట్ చెక్: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్

కాగా ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు రూ.1.58 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా బదిలీ చేసింది. పీఎం కిసాన్ యోజన డబ్బులను పొందాలంటే ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. దీని కోసం ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోం పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Exit mobile version