Site icon NTV Telugu

ఆ దేశాధ్య‌క్ష ప‌ద‌వి పోటీలో స్టార్ బాక్సర్‌…

త్వ‌రలోనే ఫిలిప్పిన్స్ దేశానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.   ఆ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు స్టార్ బాక్స‌ర్ మ‌న్నీ పాక్వియానో సిద్ధం అవుతున్నారు.  చాలా కాలంగా పాక్వియానో అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  ఆ ఊహాగానాల‌కు పాక్వియానో తెర‌దించాడు.  ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు.  మ‌న్నీ పాక్వియానో చిన్న‌త‌నంలో దుర్భ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపాడు.  తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  అయితే, బాక్సింగ్ క్రీడ‌ను ఎంచుకున్నాక ఆయ‌న జీవితం మారిపోయింది.  అంచ‌లంచెలుగా ఎదుగుతూ ప్ర‌పంచ ఛాంపియ‌న్ అయ్యాడు.  వ‌ర‌ల్డ్ రిచెస్ట్ బాక్స‌ర్‌గా అవ‌త‌రించాడు. అయితే, 2010లో ఈ స్టార్ బాక్స‌ర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.  ఆ త‌రువాత సెనెట్‌గా పోటీ చేసి విజ‌యం సాధించారు.  ప్ర‌స్తుత అధికార‌పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ అద్య‌క్షుడు డుటెర్టికి రెబ‌ల్‌గా మారాడు.  వచ్చే ఎన్నిక‌ల్లో త‌న‌దే విజ‌య‌మ‌ని చెబుతున్నాడు.  

Read: ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై సీఎం జ‌గ‌న్ స్పంద‌న‌… బాధ్య‌త మ‌రింత పెరిగింది…

Exit mobile version