Site icon NTV Telugu

ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై పవన్ ట్వీట్ల చురకలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా వుంటారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ఎయిడెడ్ సంస్థల విలీన నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ర్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ప్రక్రియపై వ్యంగ్యంగా ట్వీట్లు పోస్ట్ చేశారు.

ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేస్తోంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకల్‌ హజబ్బ స్కూలుని కట్టారు. పండ్లు అమ్మిన డబ్బుతో హరేకల హజబ్బ స్కూలును ఎలా నిర్మించగలిగారు అని ట్వీట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలపై జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుపడుతూనే వున్నారు.

Exit mobile version