మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభ విజయవంతం పట్ల పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడ నుంచి మొదలైన వారాహి యాత్రను, మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్. దారి పొడవునా హారతులిచ్చి ఆశీర్వదించిన ఆడపడుచులను, సాదర స్వాగతం పలికిన జనసేన శ్రేణులను ఎప్పటికీ మర్చిపోను అని తెలిపారు. సభకు అశేషంగా హాజరైన జన సైనికులు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. వారాహి యాత్ర, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. వారాహి యాత్ర, సభ నిర్వహణలో పాలుపంచుకున్న పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి, పార్టీ పివిపి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, లీగల్ సెల్, ఐటీ సెల్, డాక్టర్స్ సెల్ సభ్యులకు, చేసేది, మత్స్యకార వికాస విభాగాల సభ్యులకు, కృష్ణా జిల్లా కమిటీ, విజయవాడ నగర కమిటీలకు అభినందనలు తెలిపారు జనసేనాని. ఆవిర్భావ దినోత్సవ సభాస్థలికి, పార్సింగ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: YS Viveka: వివేకా హత్యకు నాలుగేళ్లు.. వారికి శిక్ష పడాలన్న సునీత
కాగా, నిన్న మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని కీలక అంశాలపై మాట్లాడారు.” ఎస్సీ ఎస్టీ, కాపులు, బీసీలు సంఖ్యాబలం ఉన్నా దేహీ అనే పరిస్థితుల్లో ఉన్నారు. కులాల్లో ఉన్న అనైక్యత. మీరు ఐక్యత సాధిస్తే మీరు రిజర్వేషన్లు మీరే తెచ్చుకుంటారు. మీరు స్వతంత్రంగా ఉండగలుగుతారు. అలాంటి కులాలకు మేం అండగా ఉంటాం. మీరు బయటకు రండి.. కలిసి పోరాడండి. ఒక కులం పెత్తనం ఆగిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లో.. దీనికి అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలి. మీరు జనసేన పాలన తేవాలి. అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు కావాలి. అగ్రకులంలో పేదల గురించి ఆలోచించాలి. గంజి అన్నం తాము తిని పిల్లలకు కూరలు పెట్టారు. మంచి ర్యాంకులు వచ్చినా చదవలేకపోవడం చూశాం. ఇలాంటి అడ్డంకులు నేను చూశాను. నాకు ఈ దేశం అన్యాయం చేస్తోందన్నా బాధ ఉంది. అగ్రకులంలో పేదలకు అండగా ఉంటాం. స్కాలర్ షిప్పులు, ఫీజు రీఎంబర్స్ మెంట్ కి ప్రయత్నిస్తాం.” అని అన్నారు.
Also Read: BRS: మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగసభ.. కేసీఆర్ టార్గెట్ అదే
తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటములు ఎదుర్కొన్నా.. ఓరిమితో బరిలో ఉన్నామని అన్నారు. రెండు చోట్ల పరాజయం పాలైనప్పటికీ.. వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు తన వెంట ఉన్నారని చెప్పారు. అన్ని విధాలా ధైర్యం చేసే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మాటలు పడ్డామని.. మన్ననలు పొందామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలన్న జనసేనాని.. అన్ని కులాలు పాలనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కులాలను కలిపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.