ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి టైటిట్ సాంగ్‌ను నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఆదివారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సాహిత్యం త్రివిక్రమ్ అందించగా… అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
మలయాళం మూవీ ‘అయ్యప్పన్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెకుతున్న ‘భీమ్లానాయక్’లో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు. 2022 సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించినా ప్రస్తుతం వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు.
