పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పవర్‌స్టార్ అభిమానులే కాదు రానా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం హీరో రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
Read Also: ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..!
రానా బర్త్‌డే కానుకగా మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు మరో అప్‌డేట్‌ను విడుదల చేస్తామని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. డానియల్ శేఖర్‌తో ఎన్‌కౌంటర్‌కు సిద్ధంగా ఉండాలని పోస్ట్ చేసింది. సాగర్ కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాలు కాగా దానిని ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే భీమ్లా నాయక్ మాత్రం ఒరిజినల్ వర్షన్ కంటే కాస్త తక్కువ రన్ టైమ్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
