Site icon NTV Telugu

బోధన్ రోడ్డు..నరకానికి కేరాఫ్ అడ్రస్

నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది బోధన్ రోడ్డు. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నవారు ఎందరో. గత రెండున్నరేళ్ళుగా బోధన, బాన్స్ వాడ రోడ్డుని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింతగా గుంతలు పడ్డాయి. గర్భిణీలు ఈ రోడ్డుపై వెళ్ళి ఆస్పత్రికి చేరాలంటే భయపడుతున్నారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వాటి అమలును మరిచిపోతున్నారు. దీంతో రోడ్డు పై ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజూ వందలాదిమంది విద్యార్ధులు ఈ రోడ్డుమీదనుంచే కాలేజీలు, విద్యాసంస్థలకు వెళ్లాలి. దీంతో ప్రయాణం అంటేనే భయంగా వుందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు వేయాలంటే.. లేదంటే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు జనం

Exit mobile version