Site icon NTV Telugu

ఆసీస్, పాక్ మధ్య నేడు రెండో సెమీ ఫైనల్

టీ 20 ప్రపంచ కప్‌ 2021 టోర్నీ ముంగింపు దశకు చేరుకుంది. నిన్న మొదటి సెమీ ఫైనల్‌ జరుగగా… ఇవాళ రెండో సెమీ ఫైనల్‌ జరుగనుంది. ఈ రెండో సెమీస్‌ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌ దుబాయి లోని ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగుతుండగా… భారత కాలమానం ప్రకారం… సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ లో పాకిస్థాన్ జట్టుకే… కాస్త ఎడ్జ్‌ ఉన్నట్లు క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

జట్లు అంచనా…
పాకిస్థాన్‌ : మహ్మద్ రిజ్వాన్ (WK), బాబర్ ఆజం (c), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రవూఫ్, షాహీన్ షా ఆఫ్రిది

ఆస్ర్టేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

Exit mobile version