Site icon NTV Telugu

రెండేళ్లుగా ఆ దేశంలో రాత్రి క‌ర్ఫ్యూ… ఎట్ట‌కేల‌కు ఎత్తివేత‌…

యూర‌ప్‌, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ కార‌ణంగా కోవిడ్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  రోజువారీ కేసులు, మ‌ర‌ణాలు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌త రెండేళ్లుగా ద‌క్షిణాఫ్రికాలో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కేసుల కార‌ణంగా నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  సౌతాఫ్రికాలో నాలుగో వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఎట్ట‌కేల‌కు నైట్ క‌ర్ఫ్యూను ఎత్తివేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌పై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌బోవ‌ని సౌతాఫ్రికా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  

Read: బాల్య వివాహాలపైన మహిళా కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది : వాసిరెడ్డి పద్మ

బ‌హిరంగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే ప్ర‌జ‌ల సంఖ్య‌ను కూడా పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ఫ‌ష్టం చేసింది.  నాలుగో వేవ్ త‌గ్గిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఒమిక్రాన్ కేసులు కొన‌సాగుతున్నాయి.  సౌతాఫ్రికాలోని 9 ప్రావిన్సుల్లో రెండు ప్రావిన్సుల మిన‌హా మిగ‌తా ఏడు ప్రావిన్సుల్లో కేసులు కొన‌సాగుతున్నాయి.  పెద్ద సంఖ్య‌లో వ్యాక్సినేష‌న్ కార‌ణంగా నాలుగో వేవ్ ఉదృతి నుంచి సౌతాఫ్రికా బ‌య‌ట‌ప‌డిన‌ట్టు అధికారులు తెలియ‌జేశారు.  క‌ర్ఫ్యూ ఎత్తివేసినా, నింబంధ‌న‌లు కొన‌సాగుతాయ‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక‌దూరం పాటించాల‌ని అధికారులు పేర్కొన్నారు. 

Exit mobile version