Site icon NTV Telugu

చాప‌కింద నీరులా ఒమిక్రాన్‌… మ‌ళ్లీ ఆంక్ష‌ల చ‌ట్రంలో ప్ర‌పంచం…

ప్ర‌పంచంలో క‌రోనా కేసుల‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.  డెల్టా వేరియంట్ ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని చుట్టేసింది.  డెల్టా నుంచి ఇంకా ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డ‌లేదు. యూర‌ప్ వంటి దేశాల్లో డెల్టా కేసులు భారీగా న‌మోదువుతున్నాయి.  యూకే, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ తోపాటు యూర‌ప్ దేశాల్లో కేస‌లు భారీగా పెరుగుతున్నాయి.  గ‌తంలో ఎన్న‌డూ లేనంత స్థాయిలో పాజిట‌వ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  దీంతో ప్ర‌పంచ దేశాలు అల‌ర్ట్ అయ్యాయి.  బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డుతున్నారు.  ఇజ్రాయిల్‌లో కొత్త వేరియంట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో స‌రిహ‌ద్దులు మూసేసింది.  అంత‌ర్జాతీయ విమానాల‌ను రద్దు చేసింది.  అయిన‌ప్ప‌ట‌కీ ఆ దేశంలో కోవిడ్ కేసులు త‌గ్గ‌డంలేదు.  

Read: ‘బీస్ట్’ షూటింగ్ పూర్తి చేసిన విజయ్, పూజా హెగ్డే!

మ‌రో ప‌ది రోజుల‌పాటు ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌యింది.  ఆసియాలోనూ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ద‌క్షిణ‌కొరియాలో రోజువారి కేసులు భారీగా పెరిగాయి.  ద‌క్షిణ‌కొరియాలో రోజుకు 7 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  గ‌తంలో ఏప్పుడూ లేనంత‌గా ప‌రిస్థితులు మారిపోతున్నాయి.  కేసులు పెరుగుతున్నా ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.  ఆంక్ష‌లు విధించి బూస్ట‌ర్ డోసులు వేయ‌కుంటే ప‌రిస్థితి త‌ల‌క్రిందుల‌య్యే అవ‌కాశం ఉంటుందని, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వ్యాప్తిచెంద‌డం మొద‌లుపెడితే క‌ట్ట‌డి చేయ‌డం మ‌రింత క‌ష్టం అవుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇప్ప‌టికే అనేక దేశాల్లో ఆంక్ష‌లు విధించారు.  అమెరికాలోనూ మ‌ళ్లీ మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తున్నారు.  ఇక ర‌ష్యాలో ప‌రిస్థితి మ‌రింత దుర్భ‌రంగా మారిపోయింది.  తాజా స‌మాచారం ప్ర‌కారం 30 వేల‌కు పైగా కేసులు, 11 వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 

Exit mobile version