దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతున్నది. ఈ ఒక్కరోజే దేశంలో 50 వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Read: ఆవులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు…
గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, జామ్‌నగర్‌లో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ 31 వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉండబోతున్నది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కేసులను బట్టి కర్ఫ్యూ సమయాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
