Site icon NTV Telugu

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం…

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  డెల్టా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నా, ఒమిక్రాన్ వ్యాప్తిని, తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగానే ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు.  మ‌హారాష్ట్ర‌లో రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంత‌ల వ‌ర‌కు నేట్ క‌ర్ఫ్యూ ను అమ‌లు చేస్తున్నారు.  మ‌హారాష్ట్ర‌లోనే అత్య‌ధికంగా ఒమిక్రాన్ కేసులు, డెల్టా కేసులు న‌మోద‌వుతున్నాయి.  హ‌ర్యానా, గుజ‌రాత్‌లో రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తుండ‌గా, యూపీలో కూడా నైట్ క‌ర్ఫ్యూ విధించారు.  రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ కొన‌సాగుతుంది.

Read: డిసెంబర్‌ 25, శనివారం దినఫలాలు…

ఈరోజు నుంచి ఈ నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులోకి వ‌స్తుంది.  అటు ఒడిశాలోనూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  ఈరోజు నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  హోట‌ల్స్‌, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు గుమికూడ‌వ‌ద్ద‌ని ఆంక్ష‌లు విధించింది.  ఇప్ప‌టికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  ఢిల్లీలో క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై నిషేధం విధించారు. ఇక త‌మిళ‌నాడులో నైట్ క‌ర్ఫ్యూ విధించే అవ‌కాశం లేద‌ని, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌డం లేదా ఆంక్ష‌లు విధించ‌డం వంటివి మాత్ర‌మే చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ఇక‌వేళ ఆంక్ష‌ల‌ను విధిస్తే వాటిని క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.    

Exit mobile version