Site icon NTV Telugu

12 దేశాల్లో బ‌య‌ట‌ప‌డిన ఒమిక్రాన్‌… అప్ర‌మ‌త్త‌మైన ఇండియా…

ప్ర‌పంచానికి ఒమిక్రాన్ భ‌యం ప‌ట్టుకుంది.  ప్రమాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మ‌రింత ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.  అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తాయనే దానిపై ప్ర‌స్తుతం ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్ 14 వ తేదీన అ వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది.  ఆ త‌రువాత క్ర‌మంగా ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రించ‌డం మొద‌లుపెట్టింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోని 14 దేశాల‌కు ఈ వేరియంట్ వ్యాపించిన‌ట్టు అధికారికంగా గుర్తించారు.  అత్య‌ధిక కేసులు ద‌క్షిణాఫ్రికా దేశంలోనే బ‌య‌ట‌ప‌డటంతో ఆ దేశం నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై డేగ‌క‌న్నువేసి ఉంచారు.  

Read: కోడిగుడ్డు శాఖాహార‌మే.. తేల్చి చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు…

యూర‌ప్ దేశాల్లో సైతం ఈ వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది.  ఇక ఆసియాలో ఇజ్రాయిల్‌, జ‌పాన్ దేశాల్లో ఈ వేరియంట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో మిగ‌తా దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఖ‌చ్చిత‌మైన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు.  ప్ర‌తి ఒక్క‌రిని స్క్రీనింగ్ చేస్తూ పీసీఆర్‌, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు.  డెల్టా వేరియంట్ నుంచి పాఠాలు నేర్చుకున్న ఇండియా ఈ విష‌యంలో ముందునుంచే అప్ర‌మ‌త్తం అయింది.  అన్న జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.  ఇండియా వంటి జ‌నాభా అధికంగా ఉన్న దేశాల్లోకి ఈ వేరియంట్ ప్ర‌వేశిస్తే వ‌చ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  అడ్డుక‌ట్ట వేయ‌డం క‌ష్టం అవుతుంది.

Exit mobile version