NTV Telugu Site icon

రహదారి పనుల కోసం తవ్వితే అవి బయట పడ్డాయి

అనంతపురం జిల్లాలో శిల్పకళా క్షేత్రం లేపాక్షి ఆలయ సమీపంలో అతి పురాతనమైన రాతి స్థంభాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి పనులకు చేపట్టిన పనుల్లో రాతి స్థంభాలు వెలుగుచూసాయి. దీంతో ఈ వార్త స్థానికులకు తెలియడంతో రాతి స్థంభాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పురావస్తు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే రహదారి పనుల్లో బయటపడ్డ వాటిని మట్టిలో పూడ్చకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు.

చెరువులో అప్పట్లో ఆలయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ రాతి స్థంభాలపై అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రాతి స్థంభాలు కొలువుదీరిన లేపాక్షి ఆలయ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. బయటపడ్డ రాతి స్థంభాలు 16వ శతాబ్దానికి సంబంధించినవి కావచ్చునని కొందరు అంటున్నారు.