దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. విపణిలోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన తరువాత వాటి కొనుగోలు పెరిగింది. ఓలా ఫ్రీ బుకింగ్ జరుగుతున్నాయి. ఇకపోతే, స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఓలా. దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించింది ఓలా. స్పోర్ట్ బైక్ మాదిరిగానే ముందు చక్రాన్ని పైకి ఎత్తడం, ఎత్తు నుంచి బైక్‌ను దూకించడం వంటివి ఓలా స్కూటర్‌తో చేయవచ్చని టెస్ట్ డ్రైవ్‌లో నిరూపితమైంది. త్వరలోనే పూర్తిస్థాయిలో టెస్ట్‌డ్రైవ్‌ను నిర్వహిస్తామని ఓలా స్కూటర్ సీఈఓ తెలియజేశారు.
Read: కొత్తగా ట్రైచేశాడు… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు…
