NTV Telugu Site icon

అఫీషియల్ : ప్రశాంత్ నీల్ తో ‘ఎన్టీఆర్31’

Official : NTR And Neel to Team Up For NTR31

‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్తలు గత కొంతకాలంగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎప్పుడు స్పష్టత వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ఎన్టీఆర్ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోనే “ఎన్టీఆర్31” గురించి కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. “ఎన్టీఆర్31” ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా బారిన పడి, క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.