NTV Telugu Site icon

Odisha Train Accident: బాధితుల ఆర్తనాదాలు.. రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్న యువత..

Odisa Train Accident

Odisa Train Accident

ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.. వందల మంది ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిశాయి.. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది..ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది..ఇప్పటివరకు 276 మంది చనిపోయినట్లు సమాచారం.. అలాగే 900 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే వీరిలో చాలా మంది బోగీల్లో ఇరుక్కుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.

 

ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాపదినంగా ప్రకటించింది.. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్‌లో గాయపడిన వారికి సాయాన్ని అందించడానికి, అలాగే రక్తదానం చేసేందుకు యువత పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

అయితే ఆర్మీ కల్నల్ ఎస్కే దత్తా మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.. కోల్ కతా నుంచి ఆర్మీ సిబ్బందిని రప్పిస్తున్నట్లు సమాచారం..రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 200 అంబులెన్సులు, 45 మొబైల్ హెల్త్ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు. 50 మంది డాక్టర్లు సహాయక చర్యల్లో భాగంగా ఘటనా చేరుకున్నట్లు తెలుస్తుంది.. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..