Odisha Train Accident: మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా, 900 మంది గాయాలపాలయ్యారు.. ఎంతో మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.. చాలా మంది బోగీల్లో ఇంకా చాలా మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి..
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్, ఖరగ్ పూర్, కోల్ కతాలోని ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన తరలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోట హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎటు చూసిన మృతదేహాలు కుప్పలుగా పడిఉన్నాయి.. ఆ ప్రాంతమంతా మృతుల బంధువుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి..
ఇక ఈ ప్రమాదంపై పలువురు టాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ తగిన సాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు.. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడ్డవారి ప్రాణాలను రక్షించేందుకు రక్త యూనిట్లను దానం చేయాలని అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.. ప్రాణాలను కాపాడేందుకు రక్త యూనిట్ల కోసం తక్షణ డిమాండ్ ఉందని నేను అర్థం చేసుకున్నాను. సాధ్యమైనంత మేరలో వెంటనే రక్త యూనిట్లు అందించాలని నా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు..అదే విధంగా..జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు..ఈ ప్రమాదంపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉంటూ బాధితులకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.. తనవంతు సాయాన్ని ప్రకటించారు.. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Utterly shocked at the tragic Coromandel express accident in Orissa and the huge loss of lives! My heart goes out to the bereaved families.
I understand there is an urgent demand for blood units to save lives. Appeal to all our fans and good samaritans in the nearby areas to…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
Heartfelt condolences to the families and their loved ones affected by the tragic train accident. My thoughts are with each and every person affected by this devastating incident. May strength and support surround them during this difficult time.
— Jr NTR (@tarak9999) June 3, 2023
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!